మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేశారంటూ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

మంత్రి పదవి ఇస్తామని చెప్పి తనను మోసం చేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గట్టుప్పల్ మండలంలో పర్యటించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను కలిసినా తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు రావడం లేదని మండిపడ్డారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా ప్రభుత్వంతో నిత్యం కొట్లాడాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు.