తీవ్ర తుఫాను ముప్పు: తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.