దమ్ముంటే రాజీనామా చేసి పరకాల్లో పోటీ చేయి: రేవంత్‌కు సుస్మిత సవాల్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే వెంటనే రాజీనామా చేసి తనపై పరకాల నుంచి పోటీకి రావాలని కొండా సుస్మిత సవాల్ విసిరారు. రేవంత్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, లక్కీగా సీఎం అయ్యారని విమర్శించారు. కొండల్‌రెడ్డి రూ.3 వేల కోట్ల డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇంగ్లీష్ రాని వ్యక్తి ఎయిర్‌ఫోర్స్ కంపెనీ పెట్టడంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన తల్లి విషయంలో రేవంత్ వ్యవహరించిన తీరుపై సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.