యుక్రెయిన్‌లో ప్రయాణికుల రైలును ఢీకొట్టిన రష్యా డ్రోన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

యుక్రెయిన్-పోలాండ్ సరిహద్దు సమీపంలో ప్రయాణికుల రైలును రష్యా డ్రోన్ ఢీకొట్టింది. మాజీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రయాణించిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. లోకో పైలెట్లు అప్రమత్తమై ప్రయాణికులను దించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పశ్చిమ యుక్రెయిన్‌లోని రైల్వే మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది.