పార్టీ ఫిరాయింపుల చట్టం లోపాలపై సీపీఐ నారాయణ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలను ఉపేక్షించడం వల్లే దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ హైదరాబాద్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత పార్టీ మారితే తక్షణమే పదవి రద్దయ్యేలా చట్టాన్ని ఎందుకు సవరించకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, కేంద్రం వెంటనే చట్టాన్ని కఠినతరం చేయాలని ఆయన కోరారు.