కాకినాడ జిల్లా తుని సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తాపడి నలుగురికి గాయాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కాకినాడ జిల్లా
కాకినాడ జిల్లా తుని సమీపంలో ఉప్పాడకు చెందిన పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొనడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే తుని ఆస్పత్రికి తరలించగా ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.