కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ ఫారం-6లో చేపట్టిన మార్పులు పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఈ మార్పులు చేయాలని టీసీఎస్ సంస్థను ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు. ఈ నిబంధనల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు.