నెల్లూరులో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం జనసేన విస్తృత ప్రచారం
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలోని 16, 21వ డివిజన్లలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, విజయలక్ష్మి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాలని కోరారు. గత పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానికులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.