ఐఫోన్ కవర్ పై రింకూ సింగ్ సరదా వ్యాఖ్యలు

రిపోర్టర్: నరేష్ స్థలం: India

భారతీయ క్రికెటర్ రింకూ సింగ్ సోషల్ మీడియాలో ఇన్ స్టామార్ట్ తో చేసిన సరదా సంభాషణ వైరల్ అయింది. రింకూ సింగ్ ముఖంతో ప్రత్యేకంగా ఐఫోన్ పద్దెనిమిది ప్రో కవర్ ను తయారు చేస్తామని ఇన్ స్టామార్ట్ పోస్ట్ చేయగా, స్పందించిన రింకూ కవర్ తయారు చేయమని, తనకు మాత్రం ఒకటి రెండు ఐఫోన్లు పంపాలని బదులిచ్చారు. ఈ ఫన్నీ రిప్లైపై నెటిజన్లు కూడా సరదాగా కామెంట్లు చేస్తూ స్పందించారు.