దీపావళి బాణసంచా ముప్పు: ఆరోగ్యంపై రసాయనాల తీవ్ర ప్రభావమంటూ వైద్యుల హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: కలిగిరి

దీపావళి బాణసంచాలో వినియోగించే రసాయనాలు మరియు వివిధ మూలకాలు మానవులు అలాగే ఇతర జీవుల ఆరోగ్యంపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతున్నాయని వైద్యులు హెచ్చరించారు. ఈ రసాయనాల కారణంగా భవిష్యత్తులో అనేక ప్రమాదకరమైన వ్యాధులు, రోగాలు వచ్చేందుకు తీవ్ర ఆస్కారం ఉందని కలిగిరి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వారు స్పష్టం చేశారు.