మణి మొదలియార్ చిత్రపటానికి నివాళులు: కర్మక్రియల కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ బాబు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వడమాలపేట
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్ గ్రామానికి చెందిన ప్రముఖులు కేవీ మణి మొదలియార్ ఇటీవలే మృతి చెందారు. బుధవారం నిర్వహించిన ఆయన కర్మక్రియల కార్యక్రమంలో నగరి నియోజకవర్గ నాయకుడు పోతుగుంట విజయ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణి మొదలియార్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. టీవీ5 రిపోర్టర్ అభి అయితం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తమ ఆత్మీయ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు. స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.