రేగటి అగ్రహారం పోరు: ఎంపీటీసీ బరిలో బంధువుల మధ్య హోరాహోరీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: గరివిడి
గరివిడి మండలంలోని రేగటి అగ్రహారం ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు వేర్వేరు పార్టీల తరఫున ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ నుంచి కడుముల కళావతి, వైకాపా తరఫున కడుముల దుర్గ పోటీపడుతున్నారు. గతంలో వీరంతా ఒకే పార్టీలో ఉండగా, ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండటంతో స్థానిక రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.