డ్యూ డేట్ సినిమా: లాయర్ పాత్రలో నటుడు సునీల్ సందడి
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
నటుడు సునీల్ లాయర్‌గా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని డ్యూ డేట్ చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆనంద్ కే దర్శకత్వంలో లోమేష్ పుడిపెద్ది హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కుతోందని, నేటి సమాజంలోని బర్నింగ్ ఇష్యూని కథా వస్తువుగా తీసుకున్నామని మేకర్స్ స్పష్టం చేశారు.