జేఎన్‌యూజీయూ వర్సిటీలో మార్కుల ట్యాంపరింగ్ గుట్టురట్టు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

విజయనగరంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-గురజాడలో జరిగిన బీటెక్‌ మార్కుల ట్యాంపరింగ్‌ ఉదంతం కలకలం రేపింది. మొదటి ఏడాది రెండో సెమిస్టర్‌ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులకు 10 నుంచి 40 మార్కులు అదనంగా వేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్టు సహాయ ఆచార్యుడు శివకుమార్‌ను తొలగించి, పొరుగుసేవల ఉద్యోగి సంతోష్‌ మృతికి దారితీసిన ఈ ఘటనపై వర్సిటీ పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.