మోత్కూరు శాఖ గ్రంథాలయానికి 115 విలువైన పుస్తకాల వితరణ: దాతలకు ప్రశంసలు
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
మోత్కూరు శాఖ గ్రంథాలయానికి అడ్డగూడూరుకు చెందిన ప్రముఖ అర్చకులు కె. శ్రీధర్ శర్మ, ఆయన సోదరి పాలకుర్తి గిరిజ భారీగా 115 పుస్తకాలను వితరణగా అందించారు. పోటీ పరీక్షలు, ఆధ్యాత్మికత, కథలకు సంబంధించిన ఈ పుస్తకాలను గ్రంథాలయ అధికారులకు అందజేసినట్లు వారు తెలిపారు. మోత్కూరు పాఠశాలలో తాము చదువుకున్నామని, విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రంథాలయ కమిటీ సభ్యులు, పాఠకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.