తెలంగాణలో 12 జిల్లాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 12 జిల్లాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇఫ్కో సహకారంతో రూ. 3.50 లక్షల వ్యయంతో ఒక్కో ల్యాబ్‌ను నెలకొల్పుతున్నారు. దీనివల్ల నెలకు 24,000 మట్టి నమూనాలను పరీక్షించి, రైతులకు ఎరువుల వాడకంపై ఖచ్చితమైన సూచనలు అందించడం ద్వారా పంట దిగుబడులను పెంచేందుకు మార్గం సుగమం అవుతుంది.