వైఎస్ జగన్ సీబీఐ కేసులపై నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సీబీఐ మరియు ఈడీ కేసుల విచారణను రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. దశాబ్ద కాలంగా ఈ కేసులు పెండింగ్లో ఉండటంతో విచారణను వేగవంతం చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ నేపథ్యంలో జగన్తో పాటు ఇతర నిందితులందరూ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది.