నెల్లూరు జిల్లాలో లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి జరగనుంది
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లె పండగ సభలో పలు అభివృద్ధి హామీలు ప్రకటించారు. కృష్ణపట్నం-రామాయపట్నం పోర్టుల మధ్య దగదర్తి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు బీపీసీఎల్ ప్లాంట్ ద్వారా లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.