'కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై అసభ్య పోస్టులు': బీఆర్ఎస్ ఫిర్యాదుతో యూట్యూబ్ ఛానెల్‌పై తీవ్ర దుమారం
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై 'తెలంగాణ దొంగలు' పేరిట నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్ మరియు సోషల్ మీడియా ఖాతాల్లో అభ్యంతరకరంగా, అవమానకరంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడటంపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. సోషల్ మీడియా వేదికగా తమ అగ్రనేతలను కించపరిచేలా ప్రచారం చేస్తున్న ఈ ఛానెల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.