గుజరాత్లో దారుణం: చిన్నారుల ముఖాలపై మలమూత్రాలు పూసిన షెల్టర్ హోమ్ మదర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Kutch
గుజరాత్‌లోని కచ్ జిల్లా మధాపర్లోని ఒక షెల్టర్ హోమ్‌లో బాలురపై దారుణ వేధింపులు వెలుగుచూశాయి. మైనర్ బాలుర ముఖాలపై మలమూత్రాలు పూసి, తీవ్రంగా కొట్టిన హౌస్ మదర్ లతీఫా బేగంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి విపుల్ డోరియా తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన అనంతరం అధికారులు ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నారు.