షాకింగ్ ఘటన: కూతురు మరణించిన మూడు వారాల్లోనే ఇల్లు అమ్మకానికి పెట్టిన నటుడు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Los Angeles
అమెరికన్ నటుడు చాడ్ లోవ్ మరియు అతని భార్య కిమ్ పెయింటర్ తమ పదమూడేళ్ల కూతురు ఫియోనా మరణించిన మూడు వారాలకే మార్ విస్టాలోని తమ ఇంటిని మూడు మిలియన్ల డాలర్లకు పైగా ధరతో అమ్మకానికి పెట్టినట్లు రియల్ ఎస్టేట్ రికార్డులు వెల్లడించాయి. గత ఏడాది సంభవించిన కార్చిచ్చులో తమ ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం, ఇటీవల తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.