హెచ్-వన్ బీ వీసా వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

రిపోర్టర్: మహేష్ స్థలం: Washington

అమెరికా హెచ్-వన్ బీ వీసా ఉద్యోగులపై తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటుగా జరిగాయని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. మిచిగాన్ లో జరిగిన సీబీఎస్ న్యూస్ టౌన్ హాల్ లో ఆయన మాట్లాడుతూ, విదేశీ కార్మికులను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని, కంపెనీల దోపిడీపైనే మాట్లాడానని తెలిపారు. వీసా వ్యవస్థలో లొసుగులు ఉన్నాయని, అమెరికన్లకు న్యాయం జరిగేలా విధానాల్లో మార్పులు అవసరమని ఆయన పేర్కొన్నారు.