భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడ్తాల్

కడ్తాల్ పట్టణంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడిని ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని, నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.