'ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తాం': మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించి తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలతో పాటు పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రుక్మిణి కల్యాణ మండపం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాయకుడు ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే నడుస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.