ఉద్యమకారుడు మన్నె క్రిశాంక్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన పోలీసులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
తెలంగాణ ఉద్యమకారుడు మన్నె క్రిశాంక్ నివాసంలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నించి, ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టినట్లు వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడి జరిగిందంటూ పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.