నంద్యాల జిల్లాలో గోరకల్లు జలాశయం గేటు ఎత్తివేతతో భయాందోళన
రిపోర్టర్: కిరణ్
స్థలం: నంద్యాల
నంద్యాల జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో ఉన్న గోరకల్లు జలాశయం వద్ద తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు అవుట్‌ఫాల్ గేటును తెరవడంతో కాలువలోకి భారీగా నీరు ప్రవహించి గోరకల్లు గ్రామంలోకి చేరింది. జలాశయం కట్ట తెగిపోతుందన్న భయంతో వృద్ధులు, పిల్లలు, మహిళలు ప్రాణభయంతో సమీపంలోని కొండపైకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని గేటును కిందకు దించి నీటి ప్రవాహాన్ని నియంత్రించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.