సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన రెండు సినిమాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలు విశ్వంభర మరియు కాకా కేవలం నాలుగు రోజుల గ్యాప్‌లో విడుదలవుతుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. జనవరి 9న విశ్వంభర, జనవరి 13న కాకా చిత్రాలను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకే హీరో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుండటంతో ఈ డబుల్ రిలీజ్ ప్లాన్‌పై స్పష్టత కోసం చిరంజీవి స్వయంగా రెండు చిత్రాల యూనిట్లతో చర్చిస్తున్నారు.