కోహెడలో రైతుల ఆందోళన.. త్రీ ఫేజ్ కరెంట్ కోసం వినతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కోహెడ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రైతులు కోహెడ సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఏఈ రవీందర్‌కు వినతి పత్రం అందజేస్తూ, పంటల సాగుకు త్రీ ఫేజ్ కరెంట్ అత్యవసరమని స్పష్టం చేశారు.
రాత్రి మూడు గంటల సమయంలోనే త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని, లేనిపక్షంలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్లు రాగుల మహేష్, కందాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.