'భక్తకోటి గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి': తిరుమలలో బ్రహ్మోత్సవాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తిరుపతి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం మలయప్పస్వామి వారు చిన్నశేష వాహనంపై పాండురంగనాథునిగా, హంస వాహనంపై వీణాపాణిగా మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాహన సేవల సమయంలో వివిధ రాష్ట్రాల కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుపతి జిల్లాలో ఈ వైభవ వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి.