ఐలమ్మ వర్ధంతి కన్వీనర్‌గా నియమితులైన కౌన్సిలర్ నాగిళ్ల జగన్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
రవీంద్రభారతిలో జరగనున్న వీరవనిత చాకలి ఐలమ్మ 131వ వర్ధంతి కార్యక్రమానికి ఆమనగల్లు మున్సిపల్ కౌన్సిలర్ నాగిళ్ల జగన్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రజక అభివృద్ధి సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని, రజక సమాజ అభివృద్ధికి అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.