ముఖ్యమంత్రి సహాయ నిధితో పేద కుటుంబాలకు భరోసా

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వడమాలపేట

వడమాలపేట మండలం వడమాల గ్రామానికి చెందిన ఎన్. శివకుమార్ మరియు పుత్తూరు మండలం తడుకు చెందిన జాహ్నవి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న బాధితులు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేయగా, శివకుమార్కు రూ. 1,79,386 మరియు జాహ్నవికి రూ. 3,11,400 చొప్పున మొత్తం రూ. 4,90,786 మంజూరయ్యాయి.