లక్నోలో భారీ మోసం గుట్టురట్టు: రెండు వందల కోట్ల స్కామ్‌లో సీఈఓ అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: లక్నో
రూపాయలు రెండు వందల యాభై కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీల మోసం కేసులో బీ కేర్ కంపెనీ డైరెక్టర్ మరియు సీఈఓ మధుమిత కౌర్‌ను రాంచీలో ఈడబ్ల్యూఆర్ అధికారులు అరెస్ట్ చేశారని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లతో పాటు వివిధ రాష్ట్రాలలో ఆమెపై ఇరవై ఆరు కేసులు నమోదయ్యాయని, నిందితురాలిని ట్రాన్సిట్ రిమాండ్‌పై లక్నోకు తరలించి కోర్టులో ప్రవేశపెట్టామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.