విజయనగరం అభివృద్ధికి సీఎం చంద్రబాబు వర్చువల్ శంకుస్థాపన

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

కూటమి ప్రభుత్వ పాలనలో పట్టణాల ముఖచిత్రం మారేలా ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో వీఎండీఆర్ఏ ఆధ్వర్యంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడి నగరాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని స్పష్టం చేశారు.