యాదగిరిగుట్టలో 26వ వేద విద్వన్మహాసభలు: ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
రిపోర్టర్: మహేష్
స్థలం: యాదగిరిగుట్ట
వేద జ్ఞానమే భారతీయ నాగరికత, సంస్కృతులకు మూలధారమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన ఇరవై ఆరో తెలంగాణ వేద విద్వన్మహాసభల్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద విద్యాసంస్థలకు మరింత ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు.