గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు సురసముద్రం వద్ద జరుగుతున్న గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకి రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఛైర్మన్ పత్య నాయక్ పాల్గొని బారికేడ్లు, లైటింగ్, క్రేన్ల ఏర్పాట్లపై ఆరా తీశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని అధికారుల బృందం ఆదేశించింది.