జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ రిజర్వేషన్లు ఖరారు: మహిళలకు యాభై శాతం కేటాయింపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులకు ప్రభుత్వం మంగళవారం రిజర్వేషన్లు ప్రకటించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ వెల్లడించారు. మొత్తం ఇరవై ఎనిమిది జడ్పీ ఛైర్పర్సన్లలో బీసీలకు ఆరు, ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు మూడు, జనరల్ మహిళలకు ఏడు, జనరల్కు ఏడు చొప్పున కేటాయించారు. జిల్లాల విభజనతో జడ్పీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మొదటి సైకిల్గా పరిగణించి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.