ఉక్రెయిన్కు నిఘా సమాచార పంపిణీ కొనసాగుతోందని స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Washington
ఉక్రెయిన్కు అమెరికా ఇంటెలిజెన్స్ సమాచార షేరింగ్ నిలిపివేయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఉక్రెయిన్కు తగిన సహాయం అందిస్తూనే ఉన్నామని, రష్యాతో కూడా కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. యుద్ధం ముగింపునకు ఇరు దేశాలను ఒకే వేదికపైకి తీసుకువస్తామని డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.