పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల మోత పదమూడు మంది మృతి
రిపోర్టర్: సతీష్
స్థలం: బలూచిస్థాన్
పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతల్లో పదమూడు మంది తాలిబన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని పాక్ సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ పరిధిలోని గులిస్థాన్ సెక్టార్లో తాలిబన్లు చొరబాటుకు యత్నించగా పాక్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ ఎదురుకాల్పుల ఘటనతో సరిహద్దు వెంబడి తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే పాక్ వాదనలను తాలిబన్లు పూర్తిగా ఖండించారు.