'కమిటీ సంభాషణలను రాజకీయ ప్రయోజనాలకు వాడటం సిగ్గుచేటు': మనీశ్ తివారీ ఆగ్రహం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
రూ.2,000లకు పైబడిన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీల విధింపు వ్యవహారం కేంద్ర ప్రభుత్వం మరియు కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయాగ్నిని రగిల్చింది. ఈ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టగా, పార్లమెంటు స్థాయీ సంఘంలో కాంగ్రెస్ ఎంపీలు పి. చిదంబరం, మనీశ్ తివారీ, గౌరవ్ గొగొయ్ ఛార్జీలను సమర్థించారని బీజేపీ ఆరోపించింది. దీనిపై మనీశ్ తివారీ స్పందిస్తూ రహస్యంగా ఉంచాల్సిన పార్లమెంటు కమిటీ సంభాషణలను మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గుచేటని తీవ్రంగా మండిపడ్డారు.