సతీమణి కేథరిన్ జీటా జోన్స్కు మైఖేల్ డగ్లస్ పుట్టినరోజు శుభాకాంక్షలు

రిపోర్టర్: రాము స్థలం: హాలీవుడ్

హాలీవుడ్ ప్రముఖ నటుడు మైఖేల్ డగ్లస్ తన సతీమణి కేథరిన్ జీటా జోన్స్కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ సెలబ్రిటీ దంపతులు తమ ప్రేమ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. స్క్రీన్పై ఆమెను చూసినప్పుడే తాను ప్రేమలో పడ్డానని, ఆమె తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అని మైఖేల్ డగ్లస్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నారు. దీనిపై కేథరిన్ జీటా జోన్స్ కూడా స్పందిస్తూ తన భర్తకు ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలిపారు.