జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ తీర్మానంపై అసెంబ్లీలో రభస

రిపోర్టర్: శివ స్థలం: శ్రీనగర్

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ప్రవేశపెట్టిన తీర్మానం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించి నినాదాలు చేశారు. 2000 నాటి స్వయంప్రతిపత్తి తీర్మాన ప్రస్తావన తేవడంతో సభలో గందరగోళం చెలరేగింది. బీజేపీ సభ్యులు తీర్మాన ప్రతులను చించివేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. ఈ తీర్మానం ద్వారా రాష్ట్ర ప్రజల శత్రువులు ఎవరనేది బట్టబయలైందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.