అమెరికాలో వైభవంగా దివాళీ కార్నివాల్: ఉత్సాహంగా దీపోత్సవ వేడుకలు

రిపోర్టర్: విజయ్ స్థలం: San Jose

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని శాన్ హోసే నడిబొడ్డున చారిత్రక ప్లాజా డి సెసార్ చావెజ్ వేదికగా దివాళీ కార్నివాల్ అండర్ ది స్టార్స్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 24వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రవేశం పూర్తిగా ఉచితంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రసిద్ధ గాయకుడు అభి వి లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.