తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి భేటీ
రిపోర్టర్: నరేష్
స్థలం: ముంబై
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబైలో సమావేశమయ్యారని అధికారులు తెలిపారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజ్ ఎత్తును 148 మీటర్ల నుంచి 150 లేదా 152 మీటర్లకు పెంచే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా పాల్గొని కీలక చర్చలు జరుపుతున్నారు.