కావలిలో భారీ నగదుతో పట్టుబడిన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎంవీఐ
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
కావలి టోల్‌ప్లాజా వద్ద అనిశా అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎంవీఐ బి.గోపినాయక్ భారీ వసూళ్ల నగదుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రాత్రుల్లో లారీలు, టిప్పర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఈ అధికారిని అదుపులోకి తీసుకుని రూ.2.48 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులతో రవాణా శాఖలో తీవ్ర కలకలం రేగింది.