సంగం బ్యారేజి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: నెల్లూరు
సంగం బ్యారేజి వద్ద భద్రతను ಕట్టుదిట్టం చేసేందుకు తెలుగుగంగ విభాగం ఎనిమిది అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వరద ప్రవాహాలు, నీటి నిల్వలతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ నిఘా నేత్రాలు ఉపయోగపడతాయి. 64 మెగాపిక్సల్ సామర్థ్యంతో పగలు, రాత్రి వేళల్లో వంద మీటర్ల మేర స్పష్టంగా దృశ్యాలను రికార్డు చేసేలా వీటిని బిగించారు.