స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపు
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరులోని రిషి గ్రాండ్ కళ్యాణమండపంలో నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశంలో ఆ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.