దేశంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్ ముప్పుపై వైద్యుల హెచ్చరిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

చెడు కొలెస్ట్రాల్ ముప్పు దేశంలో గణనీయంగా పెరుగుతోందని యశోద ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. జేఏఎంఏ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మూడో వంతు చెడు కొలెస్ట్రాల్ సమస్య భారత్, చైనాల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. జీవనశైలి మార్పులు, జంక్ ఫుడ్ వినియోగం వల్ల ఈ ముప్పు పెరుగుతోందని తెలిపారు. పదిహేనేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.