ఆలేరులో ప్రజల తాగునీటి కష్టాలు తీర్చిన మున్సిపల్ యంత్రాంగం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
ఆలేరు పట్టణంలోని పన్నెండో వార్డులో ప్రజల నీటి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్ బోరుకు కొత్త మోటారు బిగించి నీటి సరఫరా ప్రారంభించారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వార్డుల్లో వసతులు కల్పిస్తామని ఆమె తెలిపారు. నీటి సరఫరా పునరుద్ధరణపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.