న్యూజిలాండ్‌లో పర్యటించిన నేవీ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూజిలాండ్

భారత నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ న్యూజిలాండ్‌లో పర్యటించారు. ఆ దేశ నావికాదళ చీఫ్ రియర్ అడ్మిరల్ గారిన్ గోల్డింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సముద్ర భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. 2027లో తొలి ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించారు. మహాసాగర్ నినాదానికి అనుగుణంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.