హైదరాబాద్ లో సైవిట్ రీసెర్చ్ టెక్నాలజీస్ ఐదు వేదికల సమగ్ర వ్యవస్థ ప్రారంభం

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

విద్యార్థులు, వైద్యులు మరియు పరిశోధకులకు అభ్యాసం నుండి శాస్త్రీయ ప్రచురణ వరకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో సైవిట్ రీసెర్చ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన ఐదు వేదికల సమగ్ర వ్యవస్థను ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ డాక్టర్ యతీంద్ర విట్యాల తెలిపారు. హైదరాబాద్ లోని లక్డికాపూల్ హాంప్ షైర్ ప్లాజా హోటల్ లో ఈ ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. పరిశోధన ప్రయాణంలోని వివిధ దశలను అనుసంధానించేందుకు ఈ నూతన వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.